Hollywood Strike: ధ‌ర్నాలో RRR పోస్ట‌ర్…!

America:  హాలీవుడ్‌లో SAG AFTRA (స్క్రీన్ యాక్ట‌ర్స్ గిల్డ్) ధ‌ర్నా (hollywood strike) జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గురువారం నుంచి ఈ ధ‌ర్నా మొద‌లైంది. స్క్రీన్ యాక్ట‌ర్స్ గిల్డ్, రైట‌ర్స్ గిల్డ్ స‌భ్యులు త‌మ ఉద్యోగాల‌ను ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవ‌ర్ చేస్తోంద‌ని, ఇలాగైతే త‌మ‌కు ప‌ని లేకుండాపోతుందంటూ ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ ధర్నా ప‌ట్ల ప్రియాంక చోప్రాతో (priyanka chopra) పాటు ఎంతో మంది స్టార్ హాలీవుడ్ న‌టులు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ధ‌ర్నా జ‌రుగుతున్న స‌మ‌యంలో RRR పోస్ట‌ర్ క‌నిపించ‌డం వైర‌ల్ అవుతోంది. రోడ్ల‌పై ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ధ‌ర్నా చేస్తున్న‌వారిలో ఒకరు RRR పోస్టర్‌ను ప‌ట్టుకుని తిరుగుతున్నారు.

అస‌లు ఈ SAG AFTRA స్ట్రైక్ ఏంటంటే.. యూనియన్‌కి సంబంధించిన టీవీ, థియేట్రిక‌ల్ కాంట్రాక్ట్స్‌లో ఉన్న ఏ న‌టులైనా భారీ ఫీచ‌ర్ సినిమాల్లో కానీ టీవీ షోల‌లో కానీ న‌టించ‌కూడ‌దు. ఈ కాంట్రాక్ట్‌లో ఉన్న‌వారు ఏ మాధ్య‌మం ద్వారా కూడా త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి వీల్లేదు.