RRR: 200 రోజులు పూర్తి చేసుకున్న ఫ‌స్ట్ సినిమా!

Hyderabad: దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) రూపొందించిన విజువల్​ వండర్ RRR. యంగ్​ టైగర్​ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఈ చిత్రం విడుదలై ఏడాది దాటినా ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నాటు నాటు (Naatu Naatu) పాటకి ఆస్కార్ (Oscar) అందుకొని సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా జపాన్(Japan) బాక్స్ ఆఫీస్ వద్ద మరో రికార్డు క్రియేట్ చేసింది.

ఈ చిత్రాన్ని గత ఏడాది అక్టోబర్ లో జపాన్​లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 44 నగరాల్లో 209 స్క్రీన్‌లు, 31 ఐమాక్స్ స్క్రీన్స్​లో రిలీజ్ అయిన RRR ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. జపాన్​ బాక్సాఫీస్​ వద్ద ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా RRR రికార్డు సృష్టించింది. ఇక కలెక్షన్స్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా జపాన్​లో ఏకంగా JPY 2 బిలియన్ల వైపుగా దూసుకుపోతుంది.

జపాన్​లో 24 ఏళ్లుగా ఉన్న రజినీకాంత్(Rajinikanth) ముత్తు సినిమా కలెక్షన్స్ రికార్డుని బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ ఇండియన్ సినిమాగా నిలిచింది. అలాగే పలు మర్వెల్ మూవీ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే స్పీడ్ కొనసాగితే జపాన్ హైయెస్ట్ మల్టీప్లేయర్ గా నిలిచిన టైటానిక్ రికార్డుని కూడా RRR  దాటేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎన్టీఆర్​, రామ్ చరణ్​ని గ్లోబల్​ స్టార్లుగా నిలిపిన ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి మరి!