RRR: చంద్రబోస్‌కి ఆస్ట్రేలియా ప్రభుత్వ సత్కారం!
Hyderabad: టాలీవుడ్ సినీ గేయ రచయిత చంద్రబోస్(Chandrabose) ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు (Naatu Naatu) పాటతో ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నారు. హీరో శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాతో లిరిక్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన చంద్రబోస్.. వందల సినిమాల్లో వేల పాటలతో తెలుగు భాష తియ్యదనాన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక నాటు నాటు పాటతో తెలుగు భాషలోని ఊపేంటో ప్రపంచానికి చాటిచెప్పారు. పూర్తిగా తెలుగు పదాలతో రచించిన నాటు నాటు ప్రతి ఒకర్ని ఊర్రుతలుగించింది. దీంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని (Oscar) అందుకొని ప్రపంచ విజేతగా నిలిచారు.
తమ సంగీతం మరియు అక్షరాలతో ఇండియాకి ఆస్కార్ తెచ్చిన కీరవాణి, చంద్రబోస్ ని టాలీవుడ్ ఇటీవలే ఘనంగా సత్కరించింది. తాజాగా చంద్రబోస్ ని ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సన్మానించింది. ఆస్ట్రేలియా మెల్బోర్న్ లోని విక్టోరియా ప్రభుత్వం ఆస్కార్ వచ్చిన సందర్భంగా చంద్రబోస్ కి ఘనంగా సత్కారం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా RRR సినిమా విడుదలయ్యి ఏడాది పూర్తి అవ్వుతున్నా ఇంకా జోరు మాత్రం తగ్గడం లేదు. జపాన్ లో రికార్డు సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే అక్కడ 24 ఏళ్ళ పాటు ఉన్న రజినీకాంత్ రికార్డుని RRR బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని పలు మర్వెల్ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు టైటానిక్ మూవీ రికార్డుని బ్రేక్ చేయడానికి సిద్దమవుతుంది. ఈ వారం ఆన్ లైన్ బుకింగ్స్ లో RRR మళ్ళీ టాప్ 10 లో స్థానం దక్కించుకొని జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ మల్టీప్లేయర్ గా నిలిచిన టైటానిక్ ని బ్రేక్ చేసే దిశగా పరుగులు పెడుతోంది. అదే జరిగితే ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు పడటం ఖాయం.