కారు రిపేర్ చేయ‌నందుకు.. 50 కోట్ల దావా వేసిన మెగాస్టార్ హీరోయిన్

rimi sen defamation suit on a motor company

Rimi Sen: కొత్తగా ఓ షోరూం నుంచి కొన్న కారు రిపేర్‌కి రావ‌డంతో దానిని స‌రిచేసి ఇవ్వ‌నందుకు ఓ మోటార్ కంపెనీపై ఏకంగా రూ.50 కోట్ల దావా వేసారు  హీరోయిన్ రిమీ సేన్. ముంబైకి చెందిన న‌వ‌నీత్ మోటార్స్ అనే కంపెనీ నుంచి రిమీ ఓ కారు కొనుగోలు చేసారు. అయితే దాని రియ‌ర్ ఎండ్ కెమెరా స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఆమె త‌న కారుని డ్రైవ్ చేస్తున్న స‌మయంలో ఓ స్తంభానికి ఢీకొన్నారు. దాంతో వెంట‌నే ఆ కారును షోరూంకు తీసుకెళ్లి రియ‌ర్ ఎండ్ కెమెరా రిపేర్ చేసి ఇవ్వాల‌ని కోరారు. కారును షోరూంలో అప్ప‌గించి వెళ్లారు.

అయితే ఎన్ని రోజులు అవుతున్నా షోరూం నుంచి రిపేర్‌కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాక‌పోవ‌డంతో తాను మాన‌సిక క్షోభ‌కు గుర‌య్యార‌ట‌. ఇందుకు కార‌ణం న‌వ‌నీత్ మోటార్సే అని పేర్కొంటూ రూ.50 కోట్ల దావా వేస్తున్న‌ట్లు నోటీసులు పంపించారు. అంతేకాదు.. త‌న లీగ‌ల్ ఖ‌ర్చుల‌కు కూడా రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాలంటూ అదే నోటీస్‌లో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన అంద‌రివాడు సినిమాలో రిమి సేన్ యంగ్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించారు.