Rhyme Konidela: రామ్ చ‌ర‌ణ్ పెంపుడు కుక్క లైఫ్‌స్టైల్ చూస్తే షాకే..!

Rhyme Konidela: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (ram charan) ఉపాసన‌ల (upasana) వ‌ద్ద ఓ పెంపుడు కుక్క ఉందన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డికి వెళ్లినా కూడా దానిని తీసుకుని వెళ్తుంటారు. ఒక పెంపుడు కుక్క‌లా కాకుండా ఇంట్లో మనిషిగానే చూస్తుంటారు. ఈ కుక్క పేరు రైమ్ కొణిదెల‌. ఇది ఫ్రెంచ్ బార్బెట్ బ్రీడ్‌కి చెందిన శున‌కం. ఈ శున‌కం ధ‌ర 2 వేల నుంచి 4 వేల డాల‌ర్ల వ‌ర‌కు ఉంటుంది. దీనికి స‌పరేట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా కూడా ఉంటుంది. ఈ ఖాతాకు 73 వేల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.

రైమ్ కోసం బ్రాండెడ్ డిజైన‌ర్ దుస్తులు ప్ర‌త్యేకంగా కుట్టించి మ‌రీ వేస్తారు. చ‌ర‌ణ్, ఉపాస‌న త‌మ ప్రైవేట్ జెట్‌లో ఎక్క‌డికి వెళ్లాల‌న్నా వారితో రైమ్ ఉండి తీరాల్సిందే. ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి వివాహం ఇట‌లీలో జ‌ర‌గ‌డంతో రైమ్ కూడా వెళ్లింది. ఇక రైమ్ త‌న చిట్టి చెల్లెలు క్లీంకారకు తెగ కాప‌లా కాస్తుంది. క్లీంకారా ప‌డుకునే బెడ్ ప‌క్క‌నే దానికి చిన్న బెడ్‌ను సెట‌ప్ చేసార‌ట‌. (rhyme konidela)