Rhea Chakraborty: సుశాంత్ లేకుండా బతకడం చాలా కష్టం
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput) ఆత్మహత్య ఘటన ఇప్పటికీ ఈ దేశ ప్రజలు మర్చిపోలేదు. మంచి సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సుశాంత్.. ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డాడో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. ఇంకా ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తూనే ఉన్నారు. అయితే సుశాంత్‌ని చాలా మిస్సవుతున్నానని.. అతను లేకుండా బతకడం చాలా కష్టంగా ఉందని అన్నారు నటి రియా చక్రవర్తి (rhea chakraborty).
సుశాంత్ రియాతో ప్రేమలో ఉన్నప్పుడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో చాలా మందికి రియాపై ఆమె కుటుంబంపైను అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రియా.. ఆమె సోదరుడు సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు చేసారని ఆరోపణలు రావడంతో కొంతకాలం పాటు వీరిద్దరూ రిమాండ్‌లో కూడా ఉన్నారు. అయితే.. ముంబైలో జరిగిన సెలబ్రిటీ ఈవెంట్లో పాల్గొన్న రియా.. తన ప్రియుడు సుశాంత్‌ను గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. అతను లేకుండా ఉండలేకపోతున్నానని అన్నారు.
“” జీవితంలో మూవ్ ఆన్ అవ్వగలిగేది ఒక్క మనిషి మాత్రమే. జీవితంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా.. వచ్చినా వాటిని ఎదుర్కొంటూ మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. నా జీవితంలో నేను నా పార్ట్నర్ను కోల్పోయాను. నాకు మీడియా ఏడవడానికి కూడా టైం ఇవ్వలేదు. నేను ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్లాలంటే ఇదివరకులా వెళ్లలేకపోతున్నాను. కానీ నన్ను నేను ఎప్పుడూ కూడా బాధితురాలిగా అనుకోలేదు. నేను పోరాడగలను. మా నాన్న ఆర్మీలో పనిచేసారు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మా రక్తంలోనే ఉంది. ఇక నేను గడిపిన జైలు లైఫ్ గురించి చెప్పాలంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలాంటి ప్లేస్‌లో ఉండాలంటే మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. జైల్లో నాతో పాటు ఉన్న మిగతావారిలో చాలా మంది అమాయకులే ఉన్నారు అనిపించింది. నన్ను బాగా చూసుకున్నారు. మీడియా రాస్తున్నవి వారు నమ్మలేదు. కనీసం వారైనా నాకు సపోర్ట్ చేసారు.
ఇప్పుడు నా జీవితంలోని ప్రతీ అంశం సుశాంత్‌తోనే ముడిపడి ఉంటుంది. ఇప్పటికీ నేను సినిమాను నిర్మించాలంటే చాలా మంది భయపడుతున్నారు. ఇందుకు నేను వారిని నిందించను. ఎందుకంటే వారి సమస్యలు వారివి. నిజానికి నేనే కొంతమందికి చెప్పాను నన్ను సినిమాలో తీసుకోకండి అని. ఎందుకంటే పాపం వారు నన్ను నమ్మి సినిమా తీయాలనుకున్నా సమాజంలో నాపై పడిన ముద్ర వల్ల ఆ సినిమా ఎక్కడ ఫ్లాప్ అయితే నిర్మాతలు నష్టపోతారో అని నాక్కూడా భయం ఉంది “” అని తెలిపారు రియా (rhea chakraborty)