Suchitra Krishnamurthy: ఒక రాత్రి హోటల్లో ఉండమన్నాడు
Mumbai: సినిమాలు చేస్తున్న కొత్తలో ఓ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఇన్‌డైరెక్ట్‌గా తనను ఓ హోటల్‌లో రాత్రి గడపాలని అడిగినట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు నటి సుచిత్ర కృష్ణమూర్తి (suchitra krishnamurthy). తన జీవితం గురించి సుచిత్ర ది డ్రామా గర్ల్ అనే బుక్ పబ్లిష్ చేసారు. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టారు.“ ఒకసారి ఓ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సినిమా గురించి మాట్లాడటానికి ఓ హోటల్‌కి రమ్మన్నాడు. అప్పట్లో సినిమాలకు సంబంధించిన మీటింగులన్నీ హోటల్స్‌లోనే జరిగేవి. సరేనని వెళ్లాను. అప్పుడు అతను నువ్వు మీ అమ్మతో క్లోజ్‌గా ఉంటావా నాన్నతో ఉంటావా అని అడిగాడు. నేను మా నాన్నతోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉంటా అని చెప్పా. అప్పుడు అతను నాతో చెప్పిన మాట విని షాకయ్యాను. మా నాన్నతోనే క్లోజ్‌గా ఉంటాను అనగానే అయితే మీ నాన్నకు ఫోన్ చేసి రాత్రి రాను నన్ను డైరెక్టర్ డ్రాప్ చేస్తారని చెప్పు అన్నాడు. ఆ మాటలు విన్నాక నాకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే నా బ్యాగు తీసుకుని ఆ రూం నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లిపోయాను ” అని తెలిపారు.