RGV: ఇక పొలిటికల్ సినిమాలు తీయ‌ను

rgv says he will never make political films

ఇక మీద‌ట రాజ‌కీయాల‌కు సంబంధించిన సినిమాలు తీయ‌న‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు, వ్యూహం వంటి సినిమాలు తీసిన వ‌ర్మ‌.. ఆంధ్ర‌ప్రదేశ్ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి త‌న సినిమాలు, ట్వీట్ల ద్వారా స‌హ‌క‌రించేవారు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోవడంతో ఇక రాజ‌కీయా సినిమాలు చేయ‌న‌ని ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. ఇక జ‌గ‌న్ నుంచి రావాల్సిన ఇన్‌కం క‌ట్ అయిపోయింద‌నే వ‌ర్మ ఈ నిర్ణ‌యం తీసుకున్నారంటూ సెటైర్లు పేలుతున్నాయి.