RGV DEN చూసారా.. స్వ‌ర్గ‌లోకమే..!

Hyderabad: డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) త‌న ఆఫీస్ వీడియోని ఫ్యాన్స్‌కి యాంట్ వ్యూ నుంచి చూపించాల‌నుకున్నారు. RGV డెన్ పేరుతో ఈ ఆఫీస్‌ని త‌న‌కు న‌చ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నారు వ‌ర్మ‌. ప‌చ్చ‌ని చెట్లు, అల్లిక‌ల‌తో ఆయ‌న చేసిన సినిమాల నుంచి తీసిన ఫొటోలు, హీరో, హీరోయిన్ల‌తో క‌లిసి దిగిన ఫొటోలను గోడ‌ల‌కే ఇన్‌స్టాల్ చేయించుకున్నారు. ఎక్కువ‌గా ఆయ‌న లేడీ ఓరియెంటెడ్ సినిమాల నుంచి తీసిన స్టిల్స్‌ని గోడ‌ల‌ను పెట్టించుకున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ ఆఫీస్ ఆర్ట్ మ్యూజియంలా, స్వ‌ర్గ‌లోకంలా ఉంది. దీనిని కానీ ఆర్ట్ మ్యూజియంని చేస్తే ఆయ‌న బిలియ‌నేర్ అయిపోతారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బుల్లెట్ల‌తో నిండిన గ‌న్ను… ఆర్జీవీ డెన్ రెండూ ప్ర‌మాద‌మే అంటూ ఓ లేడీ చెప్తున్న డైలాగ్‌తో వీడియో స్టార్ట్ చేసారు. వర్మ మార్క్ క‌నిపించేలా మ్యూజిక్ చేయించుకున్నారు. వ‌ర్మ డెన్ ఎలా ఉందో మీరూ చూసేయండి.