Renuka Swamy Case: పవిత్ర గౌడకు మర్మాంగం ఫోటోలు పంపిన రేణుకా స్వామి
Renuka Swamy Case: కన్నడ నటుడు దర్శన్ తూగుదీప కేసు విషయంలో కీలక అంశం బయటికి వచ్చింది. మృతుడు రేణుకా స్వామికి సంబంధించిన ఫోనులోని డేటాను పరిశీలించిన పోలీసులు కీలక ఆధారాలను కోర్టులో సమర్పించారు. నటి పవిత్ర గౌడ దర్శన్‌కు దగ్గరవుతూ అతని కెరీర్‌ను నాశనం చేస్తుందేమో అన్న భయంతో రేణుకా స్వామి పవిత్రను టార్గెట్ చేసాడు. ఆ సమయంలో నేను దర్శన్ కంటే బెటర్. కావాలంటే నాది చూడు అంటూ అతని మర్మాంగం ఫోటోలను పవిత్రకు పంపాడు. ఈ టార్చర్ భరించలేక పవిత్ర గౌడ దర్శన్ సన్నిహితుడైన పవన్‌కు రేణుకా స్వామి గురించి చెప్పింది. దర్శన్‌కు తెలీకుండా రేణుకా స్వామి మ్యాటర్ డీల్ చేయాలని కోరింది.
కానీ పవన్ ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పేసాడు. దాంతో దర్శన్ కోపంతో ఊగిపోయాడు. రేణుకా స్వామిని ఎలాగైనా తన వద్దకు తీసుకురావాలని పవన్‌కు చిత్రదుర్గకు చెందిన తన ఫ్యాన్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రాఘవేంద్ర అనే మరో వ్యక్తిని పురమాయించాడు. అలా రేణుకా స్వామిని ఎలాగైనా పట్టుకోవాలని రాఘవేంద్ర పవిత్ర మాట్లాడుతున్నట్లు రేణుకా స్వామితో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వారికి రేణుకా స్వామి ఆచూకీ తెలిసింది. పవన్, రాఘవేంద్ర రేణుకా స్వామి వద్దకు వెళ్లారు. దర్శన్ అన్న పిలుస్తున్నాడు. నువ్వు చేసిన పనేం బాలేదు. అన్నకు సారీ చెప్తే నీకు సెల్ఫీ కూడా ఇప్పిస్తాం. మాతో పద అని గదమాయించారు. రేణుకా స్వామి ఆలోచించుకుని చెప్పేలోపే అతన్ని బలవంతంగా జీపులో ఎక్కించుకుని ఓ షెడ్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత దర్శన్, పవిత్రలు అక్కడికి వచ్చారు. వారిద్దరి ముందే రేణుకా స్వామికి కరెంట్ షాక్ పెట్టారు.
ఆ తర్వాత అతన్ని వేలాడదీసి ఫుట్‌బాల్‌ని తన్నినట్లు తన్నారు. అతను శాకాహారి అని తెలిసి కావాలని మాంసాహారం తినిపించారు. ఒక రోజంతా చావబాదడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం దర్శన్‌కు తెలిసి తన అభిమానులైన నలుగురు వ్యక్తుల్ని పిలిపించి ఆర్థిక గొడవల వల్ల రేణుకా స్వామిని చంపేసామని పోలీసుల ముందు లొంగిపోవాలని దర్శన్ చెప్పాడు. ఇందుకు వారు ఒప్పుకున్నారు కానీ అప్పటికే కర్ణాటక పోలీసులకు మ్యాటర్ తెలిసి దర్శన్, పవిత్ర గౌడలను అదుపులోకి తీసుకున్నారు.