Renu Desai: నా మీద పడి ఏడుస్తారెందుకు?
Renu Desai: రేణూ దేశాయ్ మరోసారి నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రేణూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న విషయాలను తన ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆమె పేద పిల్లలకు, పెంపుడు జంతువుల సంరక్షణకు కూడా తోచిన సాయం చేస్తున్నారు. వీలైతే సాయం చేయమని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లను రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్.. మీకు ఆ డబ్బు పెద్ద విషయమేమీ కాదు కదా..! అదేదో మీరే దానం చేయచ్చు కదా అని అడిగాడు. ఇందుకు రేణూ స్పందిస్తూ.. “” నాకు తోచినంత నేను సాయం చేస్తూనే ఉన్నాను. మిమ్మల్ని కూడా సాయం చేయమని అడుగుతున్నాను. ప్రతి దానికీ నేనే సాయం చేస్తే నా బ్యాంక్‌లో చిల్లి గవ్వ కూడా మిగలదు. నేను చేసే దానాల గురించి బయటికి చెప్తే గొప్పలు చెప్పుకుంటోంది అంటారు. చెప్పకపోతే అసలు సాయం చేసే గుణం లేదంటారు. మీరు దానం చేస్తే చేయండి లేదంటే లేదు. అంతేకానీ నా మీద పడి ఏడుస్తారెందుకు? కీబోర్డుపై కూర్చుని ఇతరులను ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనేం లేదనుకుంటా “” అని మండిపడ్డారు.
ALSO READ: