Renu Desai: నా లైఫ్ గురించి మాట్లాడ‌టానికి అత‌నెవ‌రు?

Renu Desai: త‌న‌ని తాను సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా చెప్పుకునే ఓ పెద్దాయ‌న రేణూ దేశాయ్ గురించి ఇంట‌ర్వ్యూల ఇచ్చి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతుంటే ఆమె స‌హించ‌లేక‌పోయారు. ఎవ‌రో ఇంట‌ర్వ్యూకి పిలిచారు కదా అని వెళ్లి రేణూ జీవితం గురించి మొత్తం త‌న‌కు తెలుసు అన్న‌ట్లు ఆయ‌న మాట్లాడారు. దీనిపై మ‌ణి అనే మ‌హిళ స్పందిస్తూ.. “” అస‌లు ఇత‌ను ఎవ‌రు రేణూ దేశాయ్ గురించి మొత్తం తెలిసిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి నిజ‌మైన జంతువుల‌ను సొసైటీ నుంచి త‌రిమికొట్టాలి “” అని మండిప‌డ్డారు.

త‌న‌కు సపోర్ట్ చేస్తున్న వారికి రేణూ థ్యాంక్స్ చెప్తూ.. ఇలాంటి మ‌గ‌వారికి త‌న జీవితంపై పూర్తి హ‌క్కు ఉన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తుంటారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇలాంటి వ్య‌క్తి త‌న‌ని తాను సీనియ‌ర్ జర్న‌లిస్ట్ అని చెప్పుకుంటున్నాడ‌ని.. ఒక‌ జ‌ర్న‌లిస్ట్ ఇలా ఎలా మాట్లాడ‌తార‌ని ప్ర‌శ్నించారు. భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల‌కు ఉప‌యోగప‌డే ప‌నులు చేయ‌కుండా సినీ రంగంలో ఉన్న మ‌హిళ‌ల‌పైనే నోరు పారేసుకుంటూ ఉంటాడ‌ని రేణూ ఏకిపారేసారు.