Renu Desai: మోసపోడానికి నువ్వేమన్నా పిల్లాడివా..?
రేణూ దేశాయ్ (renu desai) ఓ నెటిజన్‌కి క్లాస్ పీకారు. కొన్ని రోజుల క్రితం రేణూ పెట్టిన కామెంట్‌కు రిప్లై ఇస్తూ నోటికొచ్చినట్లు కామెంట్ చేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. రేణూ కుమారుడు అకీరా నందన్ (akira nandan) సినిమాల్లోకి వస్తాడేమో అని వస్తున్న రూమర్స్‌పై రేణూ స్పందించారు. అకీరాకు ఇప్పుడు సినిమాలపై ఆసక్తి లేదని తెలిపారు. ఈ విషయంపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. “” బయట ఎందరో ఆర్టిస్ట్‌లు అవకాశాల కోసం కష్టపడుతుంటే అకీరా మాత్రం సినిమాల్లోకి రావాలా వద్దా అని ఆలోచించుకుంటున్నాడు. స్టార్ కిడ్ “” అని కామెంట్ చేసాడు. ఆ కామెంట్‌పై రేణూ స్పందిస్తూ..“” అంబానీ తన కంపెనీని పిల్లల చేతికే ఇస్తాడు కానీ బయటి వాడికి ఇవ్వడు కదా..“” అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్పై ఇప్పుడు ఓ నెటిజన్ కామెంట్ చేసి రేణూకి కోపం తెప్పించాడు. (renu desai)
“” అంబానీ సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాడు. కానీ సినిమా ఇండస్ట్రీ కాపుదో కమ్మదో చౌదరి సొత్తో కాదు. అందరిదీ. మమ్మల్ని కూడా మోసం చేయాలని ప్రయత్నించకు “” అని కామెంట్ చేసాడు. దీనిపై రేణూ గట్టిగానే స్పందించారు. మోసపోడానికి నువ్వేమైనా పిల్లాడివా లేక ఇడియట్‌వా? అసలు నేను ఏ ఉద్దేశంతో అంబానీ ప్రస్తావన తెచ్చానో చూసి ఉంటే నీకు ఇంత కోపం వచ్చేది కాదు. నువ్వు కేవలం నీ సమస్యలను, నీ చేతకానితనంతో ఇతరులను దూషించే సామాన్య వ్యక్తివి. అసలు వీరికి జీవితం ఎలా ఉంటుందో కూడా తెలీడంలేదు “” అని మండిపడ్డారు.
అది అబద్ధం
తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా రేణు ఓ పోస్ట్ పెట్టారు. “” బాధ మనిషిని స్ట్రాంగ్ చేస్తుందని అంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. బాధ నాకు నమ్మకం కోల్పోయేలా చేసింది. పీడకలలు, డిప్రెషన్ వచ్చేలా చేసింది. నాకోసం కేర్ చేసే వారి సాయంతో నన్ను నేను దృఢంగా మార్చుకున్నాను. నమ్మకం, ఆశతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం “” అని ట్వీట్ చేసారు.