Renu Desai: నా జోలికి వచ్చారు ఓకే.. నా కొడుకు జోలికొస్తే బాగోదు
Renu Desai: తన కుమారుడు అకీరా నందన్‌పై కామెంట్ చేసిన నెటిజన్‌పై మండిపడ్డారు నటి రేణూ దేశాయ్. అకీరాను టాలీవుడ్‌లో చూడాలనుకుంటున్నాం అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ అసలు అకీరాది స్క్రీన్‌పై చూసే ముఖమేనా అని నెగిటివ్‌గా మాట్లాడారు. దాంతో రేణూ సదరు నెటిజన్‌పై మండిపడ్డారు.
“” నా జోలికి వచ్చారు భరించా. నా బిడ్డ జోలికి వస్తే మాత్రం ఓ తల్లిగా మిమ్మల్ని నాశనం చేసేదాకా వదలను. ఇంకా కెరీర్‌ను కూడా ప్రారంభించని అకీరాపై ఇంత నెగిటివిటీనా? ఇలా కామెంట్ చేయడానికి సిగ్గుండాలి. మీకు అకీరాను చూడటం ఇష్టం లేకపోతే చూడకండి “” అని ఆగ్రహం వ్యక్తం చేసారు.