Renu Desai: భార‌తీయుడు 2 చెత్త సినిమా

renu desai shocking comments on bharateeyudu 2

Renu Desai: క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన భార‌తీయుడు 2పై న‌టి రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసారు. భార‌తీయుడు 2 సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ వీధి కుక్క‌ల‌పై చేసిన కామెంట్‌పై ఆమె స్పందిస్తూ.. వీధి కుక్క‌ల‌కు కూడా బ‌తికే హ‌క్కు ఉంటుంది. అవి నీచ‌మైన‌వి కావు. భార‌తీయుడు 2 ఫ్లాప్ అవ్వాల్సిన సినిమానే అని మండిప‌డ్డారు.

ఇంకా ఇలాంటి సినిమాలు రాసే చెత్త రైట‌ర్లు ఉన్నారా? అని ప్ర‌శ్నించారు. రేణూ దేశాయ్‌కి మూగ జీవాల ప‌ట్ల ఉన్న ప్రేమ మాట‌ల్లో చెప్ప‌లేనిది. ఆమెకు ఎన్ని అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ వాటిని ప‌ట్టించుకోకుండా మూగ జీవాలకు సాయం చేసేవారి మెసేజ్‌ల కోసం వెతుకుతుంటారు. ఇలా త‌న వంతు సాయం చేస్తూ.. స‌మాజానికి కూడా అవ‌గాహ‌న క‌ల్పిస్తూ జంతు ప్రేమికుల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.