Renu Desai: పవన్ వల్ల చాలా సినిమాలు పోయాయ్
Renu Desai about Pawan Kalyan: తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ (pawan kalyan) వల్ల చాలా సినిమాలు పోయాయని అన్నారు నటి రేణూ దేశాయ్ (renu desai). బద్రి, జానీ సినిమాల్లో నటించిన రేణూ పవన్ను పెళ్లి చేసుకున్నాక సినిమాలు మానేసారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత రేణూ టైగర్ నాగేశ్వరరావు (tiger nageswara rao) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఇన్నేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మాత్రమే ఎందుకు ఓకే చెప్పారు అని అడగ్గా.. తానేం గ్యాప్ తీసుకోలేదని.. ఎన్నో మంచి పాత్రలు తన దాకా వచ్చినప్పటికీ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ కావడంతో తనను తీసుకునేవారు కాదని తెలిపారు. దాని వల్ల మంచి క్యారెక్టర్లు చేతి దాకా వచ్చి పోతున్నాయని చాలాసార్లు ఏడ్చానని అన్నారు. అసలు పవన్ వల్ల ఎలాంటి సమస్యలు రావని తనకు తెలిసినప్పటికీ నిర్మాతలు ఎందుకొచ్చిన గొడవలే అని సైడ్ అయిపోయేవారని తెలిపారు. (renu desai)