Renu Desai: త్వరలో అంతా మామూలైపోతుంది
Renu desai about pawan kalyan: త్వరలో అంతా మామూలైపోతుంది.. ఏదో ఒక రోజు ఇంకే బాధా లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది అంటూ తనకి తాను సర్దిచెప్పుకుంటున్నారు రేణూ దేశాయ్ (renu desai). కొంతకాలంగా మాజీ భర్త పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) సంబంధించిన అంశాలపై స్పందిస్తూ ఎన్నో కామెంట్లు, అవమానాలు భరిస్తూ వస్తున్నారు రేణు. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి నార్వేలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రేణూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టారు.
“” మనం ఏదీ వివరించకుండానే అంతా మామూలైపోతుంది. ఏదో ఒక రోజు మనల్ని బాధపెడుతున్న విషయం ఇక ఎప్పటికీ బాధపెట్టదు అని అర్థమవుతుంది. మన ఎనర్జీని తోడేసి, మనల్ని ఆలోచనలతో ముంచెత్తి బాధపెట్టిన అంశాలు ఇక బాధపెట్టవు. త్వరలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం. ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తాం. మౌనంగా ఉండే వారి మూడ్‌ని పాడుచేసి వాళ్లు రియాక్ట్ అయితే వాళ్లనే పిచ్చివాళ్లు అని తిడతారు “” అని పోస్ట్ చేసారు రేణు