Renu Desai: నాకు పవన్ గురించి తప్ప వేరే పని లేదా?
దాదాపు 30 ఏళ్ల తర్వాత టైగర్ నాగేశ్వరరావు (tiger nageswara rao) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నటి రేణూ దేశాయ్ (renu desai). సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అందంగా రెడీ అయ్యి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చేసారు. సాధారణంగా రేణూ ఏదన్నా ఒక పోస్ట్ పెట్టినా ఫోటో పెట్టినా పవన్ కళ్యాణ్ (pawan kalyan) గురించే కామెంట్స్ చేస్తుంటారు కొందరు నెటిజన్లు. అలాంటిది వీరిద్దరూ కలిసి నటించిన జానీ సినిమాలోని ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి.. పాట పెడితే ఇక ఊరుకుంటారా?
అయితే జానీ సినిమాలోని పాట కాకుండా చిట్టి చెల్లెలు సినిమాలోని ఈ రేయి తీనయిది పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేస్తూ తన వీడియోను పోస్ట్ చేసారు రేణూ. దాంతో ఒక నెటిజన్ మేడంకి అన్నయ్య గుర్తొచ్చినట్లున్నారు అని కామెంట్ చేసారు. ఈ కామెంట్‌కు రేణూ రిప్లై ఇస్తూ.. అన్నయ్య గురించి తప్ప నాకు వేరే పని లేదా? అని మండిపడ్డారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత మరిన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తారా మేడం అని అడగ్గా.. అనారోగ్య సమస్యల వల్ల బ్రేక్ తీసుకున్నానని తెలిపారు.