Renu Desai: నేను ప్రేమించినంత‌గా ప‌వ‌న్ ప్రేమించ‌డు

renu desai requests not to compare her with pawan kalyan

Renu Desai: తాను ఏద‌న్నా మంచి ప‌ని చేస్తే త‌నను మాజీ భ‌ర్త ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో (Pawan Kalyan) పోలుస్తూ కామెంట్స్ పెడుతున్నార‌ని అన్నారు రేణూ దేశాయ్. ద‌య‌చేసి అలా చేయ‌కండి అంటూ రిక్వెస్ట్ పెట్టారు. రేణూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మూగ జీవుల‌కు కావాల్సిన సాయం చేస్తూ ఇత‌రుల‌ను కూడా సాయం చేయ‌మ‌ని అర్థిస్తున్నారు. చాలా మంది రేణూ ప‌ట్ల ఉన్న గౌర‌వంతో త‌మ‌కు తోచిన సాయం కూడా చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్ స్పందిస్తూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌య్య‌లాగా వాళ్ల‌ది కూడా గోల్డెన్ హార్ట్ అని కామెంట్ పెట్టాడు.

దీనిపై రేణూ స్పందించారు. “” నేను ఏ పోస్ట్ పెట్టినా ఎందుకు మీరు నా మాజీ భ‌ర్త‌తో న‌న్ను పోలుస్తారు? ఇప్ప‌టికే నేను ఇలాంటి కొన్ని వంద‌లాది ఖాతాల‌ను డిలీట్ చేసాను. బ్లాక్ చేసాను. నేను దాదాపు ప‌దేళ్లుగా మూగ జీవుల‌కు సాయం చేస్తున్నాను. దీనికి నా మాజీ భ‌ర్త‌తో ఏం సంబంధం? నేను జంతువుల‌ను ప్రేమించినంత‌గా నా మాజీ భ‌ర్త ప్రేమించ‌డు. ద‌య‌చేసి ఆయ‌న గురించి నా పోస్టుల్లో కామెంట్స్ చేయ‌కండి. నాకు ప‌ర్స‌న‌ల్‌గా ప‌వ‌న్‌తో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ద‌య‌చేసి న‌న్ను ఆయ‌న‌తో పోల్చ‌కండి“” అని రిక్వెస్ట్ చేసారు.

నిజానికి ఆ కామెంట్ పెట్టిన నెటిజ‌న్ రేణూ దేశాయ్‌ని ప‌వ‌న్‌తో పోల్చ‌లేదు. సాయం చేసిన వారిని ప‌వ‌న్‌తో పోల్చాడు. ఆ విష‌యం రేణూకి అర్థంకాక త‌న‌ను ప‌వ‌న్‌తో పోలుస్తున్నార‌నుకుని ఇలా పోస్ట్ పెట్టారు.