Renu Desai: మా అబ్బాయి మీద ఎందుకంత‌ నెగిటివిటీ?

మా అబ్బాయి అకీరా నంద‌న్ (akira nandan) మీద ఎందుకంత నెగిటివిటీ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు రేణూ దేశాయ్ (renu desai). నిన్న అకీరా.. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావును క‌లిసి ఫొటో దిగ‌గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడ‌ని అంతా అనుకున్నారు. ఈ వ‌దంతుల‌పై రేణూ ఆల్రెడీ ప‌లుమార్లు క్లారిటీ ఇచ్చారు. అకీరా ప్ర‌స్తుతం మ్యూజిక్‌పై ఆస‌క్తి చూపుతున్నాడ‌ని.. సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపించ‌డంలేద‌ని అన్నారు.

రేణు పెట్టిన పోస్ట్‌పై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. “” ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్? ఎంత సులువు? వంద‌లాది మంది ఆర్టిస్ట్‌లు సినిమా అవ‌కాశాల కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. వారంతా యాక్టింగ్ స్కూల్స్‌కి వెళ్ల‌డం.. యాక్టింగ్‌లో కోర్సులు తీసుకోవ‌డం వంటివి చేస్తుంటారు. కానీ వారిని ఎవ్వ‌రూ గుర్తించ‌రు. కానీ ఇక్క‌డ ఒక సూప‌ర్‌స్టార్ కొడుక్కి మాత్రం సినిమాల్లోకి రావాలా వ‌ద్దా అనే నిర్ణ‌యం తీసుకోవ‌డానికి మాత్రం చాలా స‌మ‌యం కావాలి. ఒక‌వేళ రెడీగా ఉంటే ఇన్‌స్టంట్ కాఫీలాగా సినిమాకు కావాల్సిన‌వ‌న్నీ రెడీగా ఉంటాయి. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ “” అని ప్ర‌శ్నించాడు.

అత‌ను పెట్టిన కామెంట్‌కు రేణూ మొహం ప‌గిలేలా ఆన్స‌ర్ ఇచ్చారు. రేణూ ఏమ‌న్నారంటే.. “” ఉదాహ‌ర‌ణ‌కు అంబానీ తన కంపెనీల బాధ్య‌త బ‌య‌టి వారికి కాకుండా త‌న కొడుక్కి ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్? మీరు అన్న‌ట్లు ఇండ‌స్ట్రీకి చెందిన‌వారికి ఈజీగా చాన్సులు దొరుకుతాయి. ఒక‌వేళ వాళ్లు కెరీర్‌లో ఫెయిల్ అయితే దారుణంగా ట్రోల్స్ చేస్తారు. అదే బ‌య‌టివారు వ‌చ్చి ఇండ‌స్ట్రీలో ఫెయిల్ అయితే ఏమీ అన‌రు. అదే స‌క్సెస్ అయితే ఒక మాధురీ దీక్షిత్, ర‌జినీకాంత్ అవుతారు. కాబ‌ట్టి మ‌న‌పై మ‌న టాలెంట్‌పై ఫోక‌స్ చేస్తూ క‌ష్ట‌ప‌డాలి. నెగిటివిటీతో మ‌నం ఏదీ సాధించలేం. నా బుజ్జి కుమారుడు అకీరా ఇంకా సినిమాల్లోకి రాకుండానే ఇంత నెగిటివిటీకి గుర‌వుతున్నాడు పాపం.. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే.. అకీరా రోజూ పియానో నేర్చుకోవ‌డానికి గంట‌లు గంట‌లు ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఏ కళ కూడా సులువుగా రాదు “” అని క్లాస్ పీకారు. (renu desai)