Renu Desai: మీమ్స్ వేసి ఏడిపిస్తున్నారు.. నా బాధ మీకు అప్పుడే అర్థ‌మ‌వుతుంది

renu desai feels bad about people who are making memes on her

Renu Desai: త‌న కుమారుడు అకీరాకు సంబంధించిన ఏ పోస్ట్ వేసినా కూడా త‌ప్ప‌గా కామెంట్స్ పెడుతున్నార‌ని.. ఆ కామెంట్స్ రాకుండా ఉండేందుకు కామెంట్స్ సెక్ష‌న్ ఆఫ్ చేస్తున్నాన‌ని అన్నారు న‌టి రేణూ దేశాయ్‌. రెండు రోజుల క్రితం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న భార్య ఆన్నా, అకీరాను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిసారు. ఆ స‌మ‌యంలో అకీరా మోదీతో క‌లిసి దిగిన ఫోటోను రేణూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు.

అయితే రేణూ దేశాయ్ కావాల‌నే ఫోటోలో ఆన్నా లేకుండా క‌ట్ చేసి కేవ‌లం ప‌వ‌న్, అకీరా, మోదీ మాత్ర‌మే ఉన్న ఫోటోను పోస్ట్ చేసార‌ని.. ఎంతైనా భార్య భార్యే అని మీమ్స్ వేస్తున్నారు. ఆ మీమ్ త‌న దాకా రావ‌డంతో రేణూ చాలా బాధ‌ప‌డ్డారు. ఇలాంటి మీమ్స్ వేసి ఎందుకు బాధ‌పెడ‌తారు? అయినా నా బాధ మీ వ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడే తెలుస్తుంది. నాపై వ్య‌తిరేకంగా కామెంట్స్ చేస్తున్నార‌ని తెలిసి కామెంట్స్ సెక్ష‌న్ ఆఫ్ చేసాన‌ని.. అయినా కూడా ఇలా మీమ్స్ వేసి ఏడిపిస్తున్నార‌ని రేణూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు.