Renu Desai: జానీ సినిమాపై పోస్ట్.. అవసరమా మేడమ్?
Renu Desai: నటి రేణూ దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) సంబంధించిన అంశాల కారణంగానే నెట్టింట్లో వైరల్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆయన సినిమాలకు సంబంధించిన కానీ ఏం పోస్ట్ పెట్టినా అది వైరల్ అవుతుందని ఆమెకు తెలుసు. అలాంటి పోస్ట్‌లు పెడితే పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తారు. ఈ విషయం కూడా ఆమెకు తెలుసు. పోనీ వాళ్లు చేసిన కామెంట్స్‌ని చూసీచూడనట్లు వదిలేస్తారా అంటే అదీ లేదు. ప్రతి ఒక్కరికీ బొట్టు పెట్టి చెప్పినట్లు సమాధానాలు ఇస్తారు.
ఇప్పుడు జానీ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. ఆ వీడియోలో ఎంఎస్ నారాయణ.. పవన్ కళ్యాణ్‌కు.. రేణూ దేశాయ్ గురించి వివరిస్తుంటారు. ఆ వీడియోని పోస్ట్ చేస్తూ.. ఇది నేనే అని నమ్మలేకపోతున్నాను అని క్యాప్షన్ ఇచ్చారు. అసలు ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు పెట్టారో ఆమెకే తెలియాలి. పోనీ ఈరోజు జానీ రిలీజ్ అయిన రోజా అంటే అదీ కాదు. రేణూ ఇలా కావాలనే పోస్ట్‌లు పెడుతూ ఆ తర్వాత నెటిజన్లు తనను టార్గెట్ చేస్తున్నారని వారిపై నిందలు వేస్తున్నారని తెలుస్తోంది.