Renu Desai: ప్రేమించడమే నేను చేసిన నేరమా?
నిజాయతీగా ప్రేమించినందుకు జీవితాంతం శిక్ష అనుభవించడమే మనం చేసిన నేరం అయినప్పుడు.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు రేణూ దేశాయ్ (renu desai). తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ను మర్చిపోయాను అని చెప్తున్నారు కానీ.. నిజానికి ఆమె మర్చిపోలేకపోతోంది అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. ఇటీవల పవన్‌కు రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తూ వీడియో రిలీజ్ చేసిన రేణూ ఇప్పుడు మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు.
నిజాయతీగా ప్రేమించినందుకు జీవితాంతం శిక్ష అనుభవించడమే మనం చేసిన నేరం అయినప్పుడు అని రాసున్న ఫొటోను పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ కింద ఓ నెటిజన్ కామెంట్ పెడుతూ.. “” మీరు ఎంతగా దానికి ఎటాచ్ అయితే అంతగా బాధపడతారు మేడమ్. మీ జీవితంలో జరిగిన దానిని మనం చెరపలేం. కానీ మీరు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టకుండా ఉంటే జనాలు కూడా మర్చిపోతారు. మీరు పడిన బాధ చెరిపేయలేనిది. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఎవరికి ఏమివ్వాలో అది ఇచ్చి తీరతాడు. ఆయన మిమ్మల్ని కాపాడతాడు. మిమ్మల్ని కష్టపెట్టినవారి అంతు చూస్తాడు. ఇది మీ జీవితంలో జరిగిన పెద్ద విషయం. మీరు ఇంత కంటే పెద్ద విషయాల్లో సక్సెస్ అవ్వాలి. ప్రజలు ఆ సక్సెస్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. నేను మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మేడమ్. మీ బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మానేసి దాని నుంచి మూవ్ ఆన్ అయ్యేందుకు ట్రై చేయండి “” అని సలహా ఇచ్చాడు. (renu desai)
నెటిజన్ ఇచ్చిన సలహాకు రేణు రిప్లై ఇచ్చారు. “” నేను పబ్లిక్ మీటింగ్‌లలో నా విడాకులు, నాకు జరిగిన అన్యాయం గురించి ఎక్కడా మాట్లాడను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో సులువుగా దొరుకుతాను కాబట్టి సలహాలు ఇస్తుంటారు. కానీ ఎవరైతే పబ్లిక్ ప్లాట్‌ఫాంలలో నా విడాకుల గురించి మాట్లాడతారో వాళ్లు ఈజీగా తప్పించుకుంటున్నారు. నన్ను ఆల్మోస్ట్ చంపేసిన విషయాన్ని పట్టుకుని నేను వేలాడాలని అనుకోవడం లేదు. గత 11 ఏళ్లుగానే నేను సోషల్ మీడియాలో ఏ పర్సనల్ విషయాన్ని పోస్ట్ చేసినా నా విడాకుల గురించి అనుక్షణం గుర్తుచేస్తూనే ఉన్నారు. సులువుగా దొరికే వారికి సలహా ఇవ్వడం చాలా ఈజీ “” అని క్లాస్ పీకారు.
అంతేకాదు.. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేసేయండి మేడమ్ అంటూ రేణుకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వారందరికీ కలిపి రేణు ఒక పోస్ట్ పెట్టారు. “” నేనెందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అన్నా? ఆల్రెడీ ట్విటర్, ఫేస్‌బుక్‌కి దూరంగా ఉన్నాను, ఇక ఇన్‌స్టాగ్రామ్ నుంచి వెళ్లిపోమంటారా? అయినా నేను ఏం తప్పు చేసానని ఇన్‌స్టాగ్రామ్ నుంచి వెళ్లిపోవాలి? నేనేం తప్పు చేయడంలేదు. క్రిమినల్ పనులు అస్సలు చేయడంలేదు. భావప్రకటనా స్వేచ్ఛ అనేది కేవలం మీకేనా? నాకు లేదా? నేను ప్రజాస్వామ్యానికి చెందిన మనిషిని కానా? నా ఇన్‌స్టాగ్రామ్ అనేది నా పర్సనల్ స్పేస్. మీరు నా అకౌంట్ ఫాలో అవుతూ.. నా పోస్ట్‌లపై కామెంట్స్ చేస్తూ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌ని డిలీట్ చేయమంటారేంటి? ఇక నేను ఊరుకునేది లేదు. నేను నా విడాకుల గురించి నిజమే చెప్పాను. నేను నా మాజీ భర్తకు పాలిటిక్స్‌లో సపోర్ట్ చేయాలనుకున్నాను. నాకు అక్కర్లేని సలహాలు ఇచ్చేవారి మాట అస్సలు వినదలుచుకోలేదు “” అని గట్టిగా క్లాస్ పీకారు రేణూ దేశాయ్. (renu desai)