Renu Desai: ఇలా ఏడవటానికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
Renu Desai: ఇలా నా మీద పడి ఏడవటానికి మీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని ఓ నెటిజన్‌పై మండిపడ్డారు నటి రేణూ దేశాయ్. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.. రేణూ దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్.. తన తండ్రితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఎన్డీయే సమావేశంలో భాగంగా పవన్ తన కుమారుడిని కూడా ఢిల్లీ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అకీరా మోదీతో కలిసి దిగిన ఫోటోను రేణూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. తానెంతో అభిమానించే నాయకుడితో తన కుమారుడు ఇలా ఫోటో దిగడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
దీనిపై వినీత్ అనే నెటిజన్ .. అకీరా బాబు అక్కడి వరకు ఎలా వెళ్లాడో.. ఎవరు తీసుకెళ్లారో మర్చిపోయి ఫోటోను కట్ చేసి మరీ పోస్ట్ చేసారు అని కామెంట్ చేసాడు. దీనికి రేణూ సమాధానం ఇస్తూ.. “” నా మీద పడి ఏడ్చే ముందు నా పోస్ట్‌లకు కామెంట్స్ చేసే ముందు దయచేసి కాస్త ఆలోచించండి. నేనేమీ ఫోటోను కట్ చేసి పెట్టలేదు. అకీరా మోదీతో కలిసి దిగిన ఫోటోనే పోస్ట్ చేసాను. అయినా మీకు ఇలా నా మీద పడి ఏవడానికి ఇంక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? “” అని సెటైర్ వేసారు.