Renu Desai: నేను ప‌వ‌న్ భార్య ఆన్నాను కాను

renu desai again slams netizen who schooled her

Renu Desai:  రేణూ దేశాయ్ రోజూ సోష‌ల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారితో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ద‌య‌చేసి త‌న ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్ సెక్ష‌న్‌లో మాజీ భ‌ర్త అయిన ప‌వన్ క‌ళ్యాణ్‌ను ఇన్‌వాల్వ్ చేయ‌కండి అని ఎన్నిసార్లు వారించినా నెటిజ‌న్ల నుంచి కామెంట్ల ప‌ర్వం పెరుగుతోంది కానీ త‌గ్గ‌డం లేదు.

ద‌య‌చేసి న‌న్ను ప‌వ‌న్‌ను పోల్చ‌ద్దు అని రేణు పెట్టిన కామెంట్‌పై ఓ ప‌వ‌న్ అభిమాని రిప్లై పెట్టాడు. “” మేడం.. మొన్న మీరు పెట్టిన కామెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు అస‌లు జంతువుల‌ను ప్రేమించ‌డు అని చెప్పారు. ఆయ‌న‌కు కూడా మూగ‌జీవుల ప‌ట్ల ప్రేమ ఉంది మేడం. మీకు ప‌వ‌న్‌కు సంబంధం లేదు అని ఎలా అంటారు? మీకు ప‌వ‌న్‌కు పుట్టిన‌వారే క‌దా మీ పిల్ల‌లు. అలాంట‌ప్పుడు ఆయ‌న‌తో పొల్చ‌ద్దు అని ఎందుకు అంటుంటారు. ఫ్యాన్స్‌గా మేం మీ వ్యాఖ్య‌ల ప‌ట్ల చాలా బాధ‌ప‌డుతున్నాం. మీకు కూడా ఆయ‌న‌పై ఎంతో కొంత బాధ్య‌త ఉంది “” అని కామెంట్ చేసాడు.

దీనిపై రేణూ స్పందిస్తూ… “” నాకు ప‌వ‌న్ ప‌ట్ల ఎలాంటి బాధ్య‌త లేదు. ఎందుకంటే నేను ఆయ‌న మూడో భార్య ఆన్నాను కాను. ప‌వ‌న్‌కు మూగ జీవుల ప‌ట్ల ప్రేమ ఉంద‌ని మీకెలా తెలుసు? ఆయ‌న ఎప్పుడూ కూడా ఒక కుక్క‌ను కానీ పిల్లిని కానీ పెంచుకున్న పాపాన పోలేదు. మీ లెక్చ‌ర్లు ఆయ‌నకు వినిపించండి. నాకు కాదు. ఇలాంటి కామెంట్స్ న‌న్ను ఎంతో బాధిస్తున్నాయి అని ఎన్నిసార్లు చెప్పినా ఇవి ఆగేదెప్పుడు “” అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.