Renjusha Menon: ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌ల‌యాళ న‌టి

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి రెంజూషా మేన‌న్ (35) (renjusha menon) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. త్రివేండ్ర‌మ్‌లోని ఆమె ఉంటున్న‌ అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రెంజూష త‌న భ‌ర్త‌తో క‌లిసి అపార్ట్‌మెంట్‌లో నివ‌సించేవారు. ఆమె ఆర్థిక స‌మ‌స్య‌లతో స‌త‌మ‌త‌మ‌వుతోంద‌ని సన్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. కొచ్చిలో పుట్టిన రెంజూష యాంక‌రింగ్‌గా కెరీర్ స్టార్ట్ చేసారు. ఆ త‌ర్వాత సీరియ‌ల్స్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ప‌లు సినిమాల్లో కూడా న‌టించారు. నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు. రెంజూష న‌టే కాదు భ‌ర‌త‌నాట్యం డ్యాన్స‌ర్ కూడా. రెంజూష ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కొన్ని గంట‌ల ముందే త‌న కోస్టార్‌తో క‌లిసి చేసిన ఫ‌న్నీ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు.