Regina Cassandra: చాలా మందితో డేటింగ్ చేసా.. నేనొక సీరియల్ డేటర్‌ని
Regina Cassandra: తానొక సీరియల్ డేటర్‌నని ఇప్పటికే చాలా మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని అన్నారు నటి రెజీనా కస్సాండ్రా. తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఈ మధ్యకాలంలో కనిపించడంలేదు. ఇప్పుడు ఉత్సవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితమే ఈ సినిమా హరే రామ హరే కృష్ణ అనే పేరుతో లాంచ్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు ఉత్సవం పేరుతో రిలీజ్ కాబోతోంది.
ఇదొక లవ్ స్టోరీ అని అన్ని ఎమోషన్స్‌తో బాగా తీసారని వెల్లడిస్తూ తన లవ్ స్టోరీల గురించి వెల్లడించారు రెజీనా. తాను చాలా మందిని డేట్ చేసానని.. తానొక సీరియల్ డేటర్‌నని తెలిపారు. అయితే ఇప్పుడు డేటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఒకప్పుడు రెజీనా.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. సినిమా అమ్మాయిని కోడలిగా వద్దని ఇంట్లో వాళ్లు చెప్పడంతో వీరిద్దరూ విడిపోయారన్న టాక్ కూడా ఉంది.