Aamir Khan: 30 ఏళ్లలో 2 విడాకులు.. కారణం చెప్పిన మాజీ భార్య
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ 30 ఏళ్లలో ఇద్దరిని పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నారు. గతంలో ఆమిర్ ఖాన్‌కు రీనా దత్తా అనే యువతితో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. పెళ్లైన 15 ఏళ్ల తర్వాత 2002లో ఆమిర్ ఖాన్ రీనా దత్తాతో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నారు. లగాన్ సినిమా సమయంలోనే ఆమిర్ ఖాన్ కిరణ్ రావులు ప్రేమించుకున్నారని వార్తలు వచ్చాయి. ఆమిర్ జీవితంలోకి కిరణ్ రావడంల వల్లే ఆయన రీనా దత్తాతో విడిపోయారని అనుకున్నారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని కిరణ్ రావు స్పష్టం చేసారు.
అసలు లగాన్ సినిమా షూటింగ్ సమయంలో తామిద్దరం మాట్లాడుకోలేదని కిరణ్ రావు తెలిపారు. 2004లో తామిద్దరం ప్రేమించుకున్నామని.. చాలా మంది రీనా ఆమిర్ విడిపోవడానికి కారణం తనే అని అపార్ధం చేసుకుంటున్నారని తెలిపారు. “” లగాన్ సినిమా షూటింగ్ సమయంలోనే నేను ఆమిర్ ప్రేమించుకున్నామని అనుకున్నారు. ఆమిర్ మంగళ్ పాండే సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు మేం దగ్గరయ్యాం. ఆ తర్వాత కోక్ యాడ్ కోసం మేమిద్దరం కలిసి పనిచేసాం. అప్పుడే మా స్నేహం ప్రేమగా మారింది. లగాన్ షూటింగ్ సమయంలో నేను మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. నేను ఆమిర్ 2004లో కలిసి బయటికి వెళ్లేవాళ్లం. అప్పుడు మీడియా వారు లగాన్ సమయం నుంచి కలిసే ఉన్నాం నా వల్లే ఆమిర్ తన భార్యకు విడాకులు ఇచ్చేసారు అని రాసేసారు. అందులో ఎలాంటి నిజం లేదు “” అని తెలిపారు.
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమిర్, కిరణ్ రావులు కూడా విడిపోయారు. వీరిద్దరికీ సరోగసీ ద్వారా జన్మించిన ఓ కుమారుడు ఉన్నాడు.