RC16: డ్యుయెల్ రోల్​లో రామ్ చరణ్!

Hyderabad: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన(Uppena) ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchibabu) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్​ చరణ్​ పాత్ర రంగస్థలం(Rangasthalam)లో  చిట్టిబాబు పాత్ర కంటే పవర్ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అసలు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఎలాంటి పాత్ర చేయబోతున్నారు అని అప్​డేట్స్ ​కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు.

కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని, కబడ్డీ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారట. ఇద్దరు సోదరుల లాగా రామ్ చరణ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఇక ఆస్కార్​ విన్నర్​ ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు.