Rati Pandey: తెలుగు ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్.. హైద‌రాబాద్ నుంచి పారిపోయా

Rati Pandey: హిందీ సీరియ‌ల్ న‌టి ర‌తి పాండే తెలుగు ప‌రిశ్ర‌మ గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. 2006 స‌మ‌యంలో తాను ఇంకా టీవీ ఇండస్ట్రీలోకి రాక‌ముందు తెలుగు సినిమాల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాన‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో ఓ సినిమాకు ఒప్పుకుని హైద‌రాబాద్‌కు వ‌చ్చాన‌ని తెలిపారు. అప్పుడు క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నాన‌ని.. దాంతో ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా హైద‌రాబాద్ నుంచి పారిపోయి ముంబై వెళ్లిపోయాన‌ని వెల్ల‌డించారు.

“” నేను ముంబైలో ఎప్పుడూ లైంగిక వేధింపుల‌ను ఎదుర్కోలేదు. కానీ హైద‌రాబాద్‌లో ఎదుర్కొన్నాను. ఓ సినిమా చేస్తున్న స‌మ‌యంలో నాకు ఎదురైన లైంగిక వేధింపుల వ‌ల్ల అక్క‌డి నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది. అప్ప‌ట్లో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ద‌రిద్రంగా ఉండేది. అలాగ‌ని నేను ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌కు వ్య‌తిరేకిని కాను. అవ‌కాశాలు వ‌స్తే త‌ప్ప‌కుండా ప‌నిచేస్తాను. అప్పుడంటే ప‌రిస్థితి అలా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ చాలా వృద్ధి చెందింది “” అని వెల్ల‌డించారు.

అయితే ఆమె ప‌ట్ల ఇలా ప్ర‌వ‌ర్తించి ఎవ‌రు? ఏ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది అనే విష‌యాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు.