Family Star: అతిథి పాత్ర‌లో ర‌ష్మిక‌?

Family Star: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంట‌గా న‌టిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో ర‌ష్మిక మంద‌న (Rashmika Mandanna) కేమియో రోల్‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda), ర‌ష్మిక మంద‌న జంట‌కు మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌లో ఈ సినిమాలో వాడుకోవాల‌ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ (Parasuram) అనుకుంటున్నారు. వీరిద్ద‌రితో గ‌తంలో గీత‌గోవిందం (Geeta Govindam) సినిమా తీసిన ప‌ర‌శురామ్ మంచి హిట్ అందుకున్నారు. సో ఆ మ్యాజిక్‌ను ఫ్యామిలీ స్టార్‌లో కూడా చూపించాల‌నుకుంటున్నారు.