నిజ‌మేనా..?

rashmika mandanna to pair up with jr ntr

Rashmika Mandanna: వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న. ప్ర‌స్తుతం పుష్ప 2, గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి సికంద‌ర్ అనే సినిమా చేయ‌బోతోంది. అయితే ఇప్పుడు ర‌ష్మిక గురించి మ‌రో వార్త హాట్ టాపిక్‌గా మారింది. త్వ‌ర‌లో ర‌ష్మిక‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించ‌బోతోంద‌ట‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న‌ను తీసుకోబోతున్నార‌ని టాక్‌. ఒక‌వేళ ఇదే నిజం అయితే ఎన్టీఆర్, ర‌ష్మిక‌కు సంబంధించిన షూటింగ్ ఆగ‌స్ట్‌లో మొద‌ల‌వుతుంది. ఇక ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైటిల్‌ను అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.