Rashmika Mandanna పెళ్లి కబుర్లు..!
Hyderabad: నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన(rashmika mandanna) తన పెళ్లి కబుర్లు చెప్పారు. టాలీవుడ్(tollywood), బాలీవుడ్(bollywood)లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ భామ..చాలా రోజుల తర్వాత ట్విటర్‌లో(twitter) ఫ్యాన్స్‌ని పలకరించారు. షూటింగ్‌లతో(shootings) బిజీగా ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు కదా.. అంటూ ఫ్యాన్స్‌ని కుశల ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భంగా వారు రష్మికను కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు. వాటికి రష్మిక ఓపిగ్గా ఆన్సర్ చేసారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని.. “నన్ను పెళ్లి చేసుకుంటావా రష్” అని అడిగాడు. ఇందుకు రష్మిక(rashmika) స్పందిస్తూ.. “అయ్యో.. కానీ నేను బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరోలా?” అని ఆన్సర్ ఇచ్చింది. మరో ఫ్యాన్ సూర్యతో నటిస్తారా అని అడిగితే.. వెయిటింట్ అని రిప్లై ఇచ్చింది. ఇప్పుడిప్పుడే తమిళ(tamil) సినిమాల్లో కనిపించబోనని, వస్తే మంచి కమ్‌బ్యాక్‌తో వస్తానని తెలిపింది. ఇక పుష్ప-2లో శ్రీవల్లి లాంటి పాట ఉంటుందా? అని అడిగితే.. చూడాలి బాబూ అంటూ క్యూట్‌గా సమాధానం ఇచ్చింది రష్మిక(rashmika mandanna).