Rashmika Mandanna: మోసం చేసిన మేనేజ‌ర్..!

Hyderabad: ర‌ష్మిక మంద‌న (rashmika mandanna) వ‌ద్ద ప‌నిచేస్తున్న మేనేజ‌ర్ మోసానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. రూ.80 ల‌క్ష‌లు దోపిడీ చేసి ర‌ష్మిక‌ను మోసం చేసాడ‌ట‌. ర‌ష్మిక (rashmika) కెరీర్ మొద‌టి నుంచి మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆ వ్య‌క్తి మోసం గురించి బ‌య‌ట‌ప‌డంతో అత‌న్ని తీసేసింది. ఈ విష‌యాన్ని మీడియాకు చెప్పి పెద్ద సీన్ చేయ‌డం ఇష్టంలేని ర‌ష్మిక‌.. సామ‌రస్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని అనుకుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిర పుష్ప‌-2 (pushpa 2), యానిమ‌ల్ (animal) సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నారు.