Rashmika Mandanna: దేర్ దేర్ దేర్.. బ్యాక్ సైడ్.. !
విజయ్ దేవరకొండ (vijay devarakonda), రష్మిక మందన (rashmika mandanna) ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ రూమర్స్ అనుకుందామా అంటే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. రష్మిక ఒక్కోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ ఫోటో అయినా పెడితే ఆమె ఫోటో దిగిన ప్లేస్‌లో ఆల్రెడీ విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్లు ఇప్పటికే ఎన్నో ఫోటోల్లో చూసాం. మాల్దీవ్స్ వెకేషన్ విషయంలో కూడా అదే జరిగింది. వారిద్దరూ కలిసి ఒకే స్విమ్మింగ్ పూల్‌లో వేరు వేరు ఫోటోలు దిగి పోస్ట్ చేసి దొరికిపోయారు. ఆ తర్వాత మరో లొకేషన్లో కూడా ఇద్దరూ ఒకే దగ్గర ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ విషయం గురించి ఒక నెటిజన్ ట్వీట్ చేస్తే.. కూల్ బ్రో మరీ అంత ఎక్కువగా ఆలోచించకండి అని రష్మిక రిప్లై ఇచ్చింది. (rashmika mandanna)
ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు అనడానికి ఇంకో ప్రూఫ్ దొరికేసింది. ఇటీవల రష్మిక తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి కోసమని ఎల్లో చీర కట్టుకుని దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు. అయితే రష్మిక ఫోటోలు దిగిన లొకేషన్ బ్యాక్‌గ్రౌండ్.. విజయ్ దేవరకొండ ఇంటి బ్యాక్‌గ్రౌండ్ ఒకటే. దాంతో వీరిద్దరూ లివిన్లో ఉంటున్నారని 90% కన్ఫమ్ అయిపోయిందని క్లియర్ అయిపోయింది. ఇక వారిద్దరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడమే ఆలస్యం.