Rashmika Mandanna: ఫిబ్రవరిలో నిశ్చితార్ధం?
Rashmika Mandanna: ఎట్టకేలకు రష్మిక మందన, విజయ్ దేవరకొండలు (vijay devarakonda) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. గీతా గోవిందం సినిమా తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఈ విషయం వారు స్వయంగా వెల్లడించకపోయినా డేటింగ్‌లో ఉన్నామని అప్పుడప్పుడు ఫోటోలను లీక్ చేస్తూ హింట్ ఇస్తూ వస్తున్నారు. 2024లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి వివాహానికి ఇరు వైపుల పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఫిబ్రవరిలో నిశ్చితార్ధం పెట్టుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెళ్లి మాత్రం తమ చేతిలోని సినిమాలు అయిపోయాకే చేసుకోవాలని అనుకుంటున్నారట.