Rashmi Gautam: ప్రభుత్వం నాది కాదు.. నేను ఫండ్స్ తినడంలేదు
Hyderabad: “ప్రభుత్వం నాది కాదు.. నిధులు నేను దోచుకోవడం లేదు” అంటూ నెటిజన్‌ఫై ఫైర్ అయ్యారు యాంకర్ రష్మి గౌతమ్(rashmi gautam). అసలు ఏం జరిగిందంటే.. ప్రసాద్ అనే నెటిజన్ వీధి కుక్కల దాడిలో చనిపోయిన మరో బాలుడి ఘటన గురించి రష్మికి ట్వీట్ చేసారు. “తెలంగాణలో వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి,ఈ న్యూస్ చూసారా మేడం మీరు జంతు ప్రేమికులు కాదు అనడం లేదు నిత్యం కార్లలో బంగ్లాలో ఉండే మీకు ఏమి తెలుస్తుంది వీధికుక్కలు కోసం మీకు డబ్బు వుంది బాబు వాళ్ళ నాన్న రోడ్ పైన చెవి రింగులు అమ్ముకుంటాడు. ఒక సినిమా పోతేనే తట్టుకోలేని మీరు అక్కడ ఒక బాబు ప్రాణం పోతే వాళ్ళ అమ్మ నాన్న లు ఎలా తట్టుకుంటారు దయచేసి వాళ్ళకి ఏదో ఒక రూపం లో హెల్ప్ చెయ్యండి మీరు పెంపుడు కుక్కలు మధ్య పెరుగుతారు సాధారణ జనం వీడి కుక్కలు మధ్య పెరుగుతారు” అని రష్మిని, ప్రముఖ నటి అక్కినేని అమలను ట్యాగ్ చేసాడు. ఈ ట్వీట్స్‌కు రష్మి రిప్లై ఇచ్చారు.
“మీరు రాంగ్ వ్యక్తులను ట్యాగ్ చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందో ఆ రాష్ట్ర అధికారులను ట్యాగ్ చేయండి. బ్రీడ్ కుక్కలను పెంచుకోవడం మానేసి వీధి కుక్కలను పెంచుకుంటే రోడ్డలపై కుక్కలు తగ్గిపోతాయ్ వాటి దాడులు ఆగిపోతాయ్. అంతేకానీ నన్ను ట్యాగ్ చేస్తే ఏమీ రాదు. ప్రభుత్వం నాది కాదు. నేను ఫండ్స్ ఇవ్వలేను. ఆ ఫండ్స్ తినడంలేదు. చెప్పాలంటే నా సొంత డబ్బులతో ఎన్నో కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాను” అని మండిపడ్డారు రష్మి.