Rashi khanna: పెళ్లైన హీరోతో అంత చనువు అవసరమా?
Rashi khanna: సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లపై ఇప్పుడు జనాలకు నమ్మకం లేకుండా పోయింది. శుభమా అని వారు ప్రేమ వివాహం చేసుకున్నా కూడా ఆ మహా అంటే నాలుగేళ్లు కలిసి ఉంటారు.. ఈ మాత్రం దానికి అంత సంబరపడిపోవాలా అని కామెంట్స్ చేస్తుంటారు. సినీమా వాళ్ల ఆలోచనా విధానం వేరేలా ఉంటుంది. వారికి వివాహం అయినా కూడా ఇతర నటీనటులను హగ్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అందులో తప్పేమీ లేదు. కానీ ఆ చనువు మితిమీరితేనే సమస్య. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. (Rashi Khanna)
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra), రాశీ ఖన్నా జంటగా యోధ (Yodha) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో, హీరోయిన్లు కలిసి చాలా ఈవెంట్లకు హాజరవుతున్నారు. అయితే వీరిద్దరూ సినిమాలో జంటగా మాత్రమే నటించారు. సిద్ధార్థ్‌కు ఆల్రెడీ కియారా అడ్వాణీతో పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ మర్చిపోయినట్లున్నాడు పాపం. రాశీ ఖన్నా చెయ్యి పట్టుకుని మరీ ఈవెంట్లకు వెళ్తున్నాడు. ఫోటోలకు పోజులిచ్చే సమయంలో వీరిద్దరూ కోస్టార్స్‌గా కాకుండా కపుల్‌గా పోజులిస్తున్నారు.
ALSO READ: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో ప్రేమ.. కన్ఫామ్ చేసిన రష్మిక
ఈ వీడియోని కియారా అడ్వాణీ చూస్తే సిద్ధార్ధ్ పరిస్థితి ఏంటో పాపం. సినిమాలో అంటే హీరో హీరోయిన్లు చేతులు పట్టుకోవడం నుంచి ఏకంగా శృంగార భరితమైన సన్నివేశాల్లో నటించడం వరకు అన్నీ నడుస్తాయి. కానీ నిజ జీవితంలో అలా కాదు కదా..! ఎంత కలిసి పని చేస్తే మాత్రం ఇలా చేతుల్లో చేతులు వేసుకుని తిరిగేంత చనువు ఎందుకు? అని నెటిజన్లు, కియారా అడ్వాణీ అభిమానులు మండిపడుతున్నారు. సిద్ధార్ధ్ ఇప్పటికైనా తనకు పెళ్లైందన్న విషయాన్ని గుర్తుంచుకుని మసులుకుంటే బాగుంటుందని అంటున్నారు.
ఈ మధ్యకాలంలో రొమాంటిక్ సన్నివేశాల అంశంలో కూడా నటీనటుల భాగస్వామ్యులు హద్దులు పెడుతున్నారు. అందుకే చాలా మంది నటీ నటులు పెళ్లైన తర్వాత ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు ఒప్పుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణ ప్రియమణి. తన భర్త, అత్తింటివారికి ఇబ్బంది కలిగించే పనులు అస్సలు చేయాలనుకోవడం లేదని.. అందుకే పెళ్లయ్యాక రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదని ఫిక్స్ అయ్యానని తెలిపారు. ఈ బుద్ధి చాలా మందికి లేకపోవడం బాధాకరం.