RAPO20: మాస్​ జాతర.. అదిరిపోయిందిగా!

Hyderabad: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ‘ఇస్మార్ట్​ శంకర్​’(Ismart Shankar) సినిమాతో ఊర మాస్​ యాక్టర్​గా మారిపోయారు. ఆ తర్వాత సినిమాలన్నీ మాస్​ బ్యాగ్రౌండ్​తోనే వస్తున్నాయి. ఇక రామ్​ ప్రస్తుతం టాలీవుడ్​ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinivas) డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మే 15న రామ్​ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ని విడుదల చేసి అభిమానులకు ఫుల్ ట్రీట్​ ఇచ్చారు మేకర్స్​.

తాజాగా విడుదలైన గ్లింప్స్ మొత్తాన్ని ఎప్పటిలానే యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసాడు బోయపాటి. అంతేకాదు ఈ సినిమా కోసం రామ్​ బాడీని కూడా పెంచినట్టున్నాడు. ఇక ఈ గ్లింప్స్ లో ‘నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్’ అంటూ రామ్ చెప్పిన మాస్ డైలాగ్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ కి జోడిగా టాలీవుడ్​ సెన్సేషన్​ శ్రీలీల (Sreeleela) నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్​లో దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్​లోనే ఈ రేంజ్​ డైలాగ్స్​తో అదరగొట్టిన బోయపాటి సినిమాలో ఎలాంటి మాస్​ డైలాగ్స్​తో అదరగొట్టనున్నాడో చూడాలి మరి!