Randeep Hooda: హీరోకు క్లాస్ పీకిన నేతాజీ కుటుంబ సభ్యుడు
Mumbai: బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాకు (randeep hooda).. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (netaji subhash chandra bose) కుటుంబీకులు క్లాస్ పీకారు. మరో స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సవార్కర్‌పై రణ్‌దీప్ ఓ బయోపిక్ తీస్తున్నారు. దీనికి స్వాతంత్ర్య వీర్ సవార్కర్ (swatantra veer savarkar) అని టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. రణ్‌దీప్ పెట్టిన ట్వీట్ నేతాజీ కుటుంబీకులకు ఏమాత్రం నచ్చలేదు. బ్రిటిషర్లకు మోస్ట్ వాంటెడ్ ఇండియన్..నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, కుదీరామ్ బోస్‌ల నుంచి స్ఫూర్తిపొందిన వీర్ సవార్కర్ ఎవరు? ఈ సినిమా చూసి నిజనిజాలు తెలుసుకోండి అని ట్వీట్ చేసాడు.
ఈ ట్వీట్ చూసిన నేతాజీ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్ స్పందించాడు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన జీవితంలో కేవలం ఇద్దరి నుంచే స్ఫూర్తిపొందారు. వారిలో ఒకరు స్వామీ వివేకానంద, మరొకరు దేశబంధు చిత్రంజన్ దాస్. వీరి నుంచి కాకుండా నాకు తెలిసి బోస్ ఇంకెవరినీ ఇన్‌స్పిరేషణ్‌గా తీసుకోలేదు. సవార్కర్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. కానీ బోస్ ఆలోచనలు, సవార్కర్ ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు బోస్ సవార్కర్‌ను ఎందుకు ఫాలో అవుతారు. రణ్‌దీప్ హుడా తప్పుడు విషయాలను ప్రజలకు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్లుగా తీస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఇలాంటి కాంట్రొవర్సీ వ్యాఖ్యలు చేసే సినిమాకు మైలేజ్ వస్తుందని డైరెక్టర్ ప్లాన్ వేసారేమో. చరిత్రను తప్పుగా చూపిస్తే అది వారికే ప్రమాదం” అని హెచ్చరించారు. అయితే దీనిపై ఇప్పటివరకు రణ్‌దీప్ స్పందించలేదు.