Ranbir Kapoor: బాలీవుడ్ ప్రేక్షకులను అలరించలేకపోతోంది!
Mumbai: ఇండియన్ సినిమా(Indian Cinema) అంటే బాలీవుడ్(Bollywood) అనేంతగా పాపులర్ అయిన హిందీ సినిమా(Hindi Cinema) కొన్నాళ్లుగా ప్రేక్షకులను అలరించలేకపోతోంది. చాలారోజులుగా సరైన హిట్‌లేక వెలవెలబోతున్న బాలీవుడ్‌కి పఠాన్(Pathan)తో హిట్ ఇచ్చి మరోసారి బాలీవుడ్ బాద్షాగా నిరూపించుకున్నారు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan). అయితే ఈ సినిమా కూడా బాలీవుడ్‌ని సక్సెస్ బాట పట్టించలేకపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్(Salman Khan), అమీర్ ఖాన్(Aamir Khan), అక్షయ్ కుమార్(Akshay Kumar) సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణం. చాలా రోజులుగా బాయ్‌కాట్ ట్రెండ్‌తో విడుదలైన ప్రతి సినిమా నెగిటివిటీని మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటులంతా దక్షిణాది సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor).
రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు కావల్సిన సినిమాలు అందించడంలో తడబడుతోంది. ఏ తరహా సినిమాలు అందించాలనే విషయంలో హిందీ చిత్ర పరిశ్రమ అయోమయంలో పడింది. వెస్ట్రన్ సినిమా ప్రభావానికి లోనుకావడమే ఇందుకు కారణం. గత ఇరవై ఏళ్ళుగా… బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఫిల్మ్ మేకింగ్ లో తడబడుతుంది.. ఫిలిం మేకింగ్‌లో కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ తరహా సినిమాలతో సక్సెస్ సాధించవచ్చు అనే విషయంలో.. స్పష్టతను అంతకంతకూ కోల్పోతోంది. అంతే కాదు హాలీవుడ్ ను ఫాలో అవ్వడం, ఆ సినిమాలు రీమేక్ చేయడం.. ఆ స్టైల్ ను పులుముకోవడం వల్లే ఈపరిస్థితి వచ్చింది’ అన్నారు. కొంతమంది హీరోహీరోయిన్లు కొత్తవారికి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని.. వారు ఈ పద్ధతిని మార్చుకుంటే, ఇండస్ట్రీలో కొత్త ట్యాలెంట్స్ బయటకొస్తాయని.. అప్పుడు మళ్లీ ఇండస్ట్రీ సక్సెస్ బాటలో పయనిస్తుందని అన్నారు రణ్‌బీర్. ప్రస్తుతం రణ్‌బీర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.