Ranbir Kapoor: అప్పుడు రష్మిక విజయ్ ఇంట్లోనే ఉంది..!
Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్, రష్మిక మందన (rashmika mandanna) కాంబినేషన్లో యానిమల్ (animal) అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. అయితే రష్మిక.. విజయ్ దేవరకొండ (vijay devarakonda) డేటింగ్లో ఉన్నారని వీరిద్దరూ కలిసే ఒకే ఇంట్లో ఉంటున్నారని వారు పోస్ట్ చేసే ఫోటోలను బట్టి తెలుస్తోంది. ఇప్పుడు రణ్బీర్ కపూర్ ఒక విషయం బయట పెట్టి అన్ని డౌట్స్ క్లారిఫై చేసేసాడు.
కాఫీ విత్ కరణ్ షోలో రణ్బీర్ ఒక సీక్రెట్ బయటపెట్టి రష్మికను అడ్డంగా బుక్ చేసేసాడు. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటంటే.. యానిమల్ కథను రష్మికకు చెప్పాలని సందీప్ అనుకున్నప్పుడు ఆమెను కలిసేందుకు వెళ్లాడట. అయితే సందీప్ రష్మిక ఇంటికి కాకుండా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందట. అప్పుడు రష్మిక విజయ్ ఇంట్లోనే కనిపించిందని రణ్బీర్ తెలిపాడు. దాంతో రష్మిక ఎందుకు చెప్పావ్ అన్నట్లు రియాక్ట్ అయ్యింది. దీనిని బట్టి చూస్తే రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారు అనేది క్లియర్ అయిపోయినట్లే అని ఫ్యాన్స్ కూడా తెగ కామెంట్స్ పెడుతున్నారు.