Rana Naidu: సీజన్​ 2 వచ్చేస్తోంది!

Hyderabad: దగ్గుబాటి రానా(Rana), విక్టరీ వెంకటేష్(Venkatesh)​ నటించి సంచలనం సృష్టించిన సిరీస్​ రానా నాయుడు(Rana Naidu). ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్​ ఊహించని పాత్రలో నటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రముఖ ఓటీటీ నెట్​ఫ్లిక్స్​(Netflix)లో విడుదలైన ఈ సిరీస్​ని పలువురు సినీ ప్రముఖులు కూడా విమర్శించారు. అయితే మంచి, చెడు రెండింటిలోనూ సంచలనంగా నిలిచారు బాబాయ్​, అబ్బాయ్​. మొదటగా, తెలుగు కుటుంబాలు మరియు నటుడు వెంకటేష్ యొక్క మహిళా అభిమానుల నుండి ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ షో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. కానీ, విపరీతమైన బూతులు, అశ్లీలతో పలు విమర్శలు అందుకుంది.

ఈ సిరీస్​ని చూసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నేరుగానే విమర్శించినా ట్రెండింగ్​లో ఉంటూ రికార్డులు సృష్టించింది రానా నాయుడు. మిగతా భాషల కంటే తెలుగులో విపరీతమైన ట్రోల్స్​ ఎదుర్కొన్న ఈ సిరీస్​ తెలుగు వెర్షన్​ను నెట్​ఫ్లిక్స్​ తొలగించింది. అయితే ఈ సిరీస్​పై తాజా అప్​డేట్​ ఇచ్చింది నెట్​ఫ్లిక్స్​. ఇన్ని విమర్శల మధ్య సూపర్​ హిట్​గా నిలిచిన ఈ సిరీస్​కు రెండవ సీజన్ రాబోతోందని ప్రకటించింది. ‘ఏం బాధపడకండీ.. మీ కిరికిరికి సమాధానం చెప్పేందుకు రానా నాయుడు సీజన్​ 2తో వచ్చేస్తున్నాడు’ అంటూ పోస్ట్​ చేశారు.  IMDB యొక్క ప్రముఖ భారతీయ ప్రముఖుల ర్యాంకింగ్‌లో వారంలో అగ్రస్థానంలో నిలిచిన రానా, వెంకటేష్​తో మరో సీజన్​ను నిర్మించనున్నట్లు వెల్లడించారు మేకర్స్​.

రానా నాయుడుతో తను సాధారణంగా చేసే పాత్రల పరిధి దాటి నటించానని వెంకీ  స్వయంగా ప్రకటించారు. విడుదలకు ముందే ఈ సిరీస్​ని కుటుంబంతో కలిసి చూడకండి అని చెప్పుకొచ్చారు. రిలీజ్​ తర్వాత కూడా పలు విమర్శలపై స్పందించిన రానా ప్రేక్షకులకు క్షమాపణ చెప్పారు.