Rana Daggubati: నాని మాట‌ల్లో త‌ప్పేముంది?

సూర్య (surya) న‌టించిన జై భీం (jai bhim) సినిమాకు ఒక్క నేష‌న‌ల్ అవార్డు (national award) కూడా రాక‌పోవ‌డంపై ఫ్యాన్స్ నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ బాధ‌ప‌డ్డారు. దీనిపై మొద‌ట స్పందించింది నేచుర‌ల్ స్టార్ నాని (nani). అవార్డులు అనౌన్స్ చేసిన‌రోజు జై భీంకు రానందుకు హార్ట్ బ్రేక్ అయిన ఎమోజీతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. నాని అలా రియాక్ట్ అవ‌డంపై రానా ద‌గ్గుబాటి (rana daggubati) స్పందించారు. నాని పెట్టిన పోస్ట్‌లో త‌ప్పు, వివాదం ఏమున్నాయ‌ని ప్ర‌శ్నించారు.

“” ఎవ‌రి అభిప్రాయం వారిది. నాకు ఒక సినిమా న‌చ్చితే మీకు ఇంకో సినిమా న‌చ్చుతుంది. ఆర్టిస్ట్‌లకు కూడా అంతే. ఇక్క‌డ సూర్య సినిమాకు అవార్డు రాలేద‌న్న‌ది మ్యాటర్ కాదు. జై భీం క‌థ‌కు రాలేద‌ని అంతా ఫీల‌య్యారు. అంతేకానీ ఒక‌రికి అవార్డు వ‌చ్చింది కాబ‌ట్టి ఇంకో హీరో కుళ్లుకోవ‌డం లాంటివి ఉండ‌వు. మాగ్జిమం ఒక హీరో త‌న అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఒక ట్వీట్ చేస్తాడు. ఆ ట్వీట్‌కు మీకు థంబ్‌నెయిల్స్, వీడియోలు, వార్త‌లు రాసి నా లాంటివారి నుంచి స‌మాచారం తీసుకుని వివాదాస్ప‌దం అయ్యేలా చేసేది మీడియా. అయినా జై భీం సినిమా విష‌యంలో నాని పెట్టిన పోస్ట్‌లో త‌ప్పేముంది? “” అని స్పందించారు రానా. (rana daggubati)