Rana Daggubati: హీరోయిన్‌కి సారీ చెప్పిన రానా

Hyderabad: రానా ద‌గ్గుబాటి (rana daggubati) బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్‌కు (sonam kapoor) సారీ చెప్పారు. ఇటీవ‌ల రానా.. దుల్క‌ర్ స‌ల్మాన్ యాక్ట్ చేసిన కింగ్ ఆఫ్ కోటా అనే సినిమా ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లారు. ఆ స‌మ‌యంలో రానా స్టేజ్‌పై దుల్క‌ర్‌తో త‌న‌కున్న ఫ్రెండ్‌షిప్ గురించి, సెట్స్‌లో అత‌ను ఎలా ఉంటాడు అనే విష‌యాల గురించి మాట్లాడారు.

“” నేను దుల్క‌ర్ ఒకే యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లాం. త‌ను నా జూనియ‌ర్. అక్క‌డ మేం ఫ్రెండ్స్ అయ్యాం. అత‌ను చాలా మ‌ర్యాద‌స్తుడు. ఓసారి దుల్క‌ర్ ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం లండ‌న్ వెళ్లాడు. లండ‌న్‌లోని మా ఇంటి ప‌క్క‌నే షూటింగ్ అవుతోంది. ఆ సినిమా ప్రొడ్యూస‌ర్స్ నా ఫ్రెండ్సే. స‌ర‌దాగా క‌లుద్దామ‌ని వెళ్లా. ఓ పెద్ద బాలీవుడ్ న‌టి అందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఓ సీన్ టేక్ స‌మయంలో దుల్క‌ర్ స్పాట్ బాయ్ ప‌క్క‌న నిల‌బ‌డి వెయిట్ చేస్తున్నాడు. కానీ హీరోయిన్ గారు మాత్రం త‌న భ‌ర్త‌తో లండ‌న్‌లో ఎక్క‌డ షాపింగ్‌కి వెళ్దాం అంటూ గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌కు సెట్స్‌లో ఉన్న‌వారంతా ఇరిటేట్ అయ్యారు. కానీ దుల్క‌ర్ మాత్రం ఇట్స్ ఓకే అన్న‌ట్లు కూల్‌గా కామ్‌గా ఉన్నాడు. అది దుల్క‌ర్ అంటే “” అని అన్నారు. (rana daggubati)

అయితే బాలీవుడ్ వెబ్‌సైట్స్ కూడా రానా సోన‌మ్ క‌పూర్‌పై కామెంట్ చేసాడు అని వార్త‌లు రాసేస్తుండ‌డంతో రానా ట్విట‌ర్ ద్వారా సారీ చెప్పారు. “” మీరు అనుకుంటున్న‌ట్లు నేను సోన‌మ్ గురించి అన‌లేదు. నాకు సోన‌మ్, దుల్క‌ర్ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్. నా మాట‌ల వ‌ల్ల ఎవ‌రైనా హ‌ర్ట్ అయివుంటే సారీ. నేను జోక్‌గా అన్న‌దానిని మీరు సీరియ‌స్‌గా తీసేసుకున్నారు “” అని ట్వీట్ చేసారు రానా.

రానా స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు ఏ హీరోయిన్ పేరు కూడా చెప్ప‌లేదు. కానీ ఆయ‌న మాట్లాడుతోంది సోన‌మ్ క‌పూర్ (sonam kapoor) గురించే అని అంద‌రికీ అర్థం అయిపోయింది. ఎందుకంటే దుల్క‌ర్ హిందీలో కేవ‌లం మూడు సినిమాలే చేసారు. అందులో హీరోయిన్ ఉన్న‌ది కేవ‌లం జోయా ఫ్యాక్ట‌ర్ అనే సినిమాలో. ఈ సినిమా షూటింగ్ టైంలో సోన‌మ్ త‌న భ‌ర్త ఆనంద్‌తో లండ‌న్‌లో సెటిల్ అయిపోయింది. పైగా రానా మాట్లాడిన దాంట్లో ఏమాత్రం త‌ప్పు లేదు. ఎందుకంటే సోన‌మ్ సెట్స్‌లో ఉన్న‌ప్పుడు త‌న‌కు తెలిసిన‌వారితో మాత్ర‌మే ఫ్రెండ్లీగా ఉంటుంది. వేరే ఇండ‌స్ట్రీ నుంచి వచ్చినా, ఆ వ్య‌క్తికి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా అస్స‌లు పట్టించుకోదు. ఆమె ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల చాలా మంది దూరంగా ఉండట‌మే బెట‌ర్ అనుకుంటారు. (rana daggubati)