Ramabanam: వెరైటీగా మూవీ ప్రమోషన్స్!
Hyderabad: టాలీవుడ్ హీరో గోపీచంద్(Gopichand) తాజాగా నటించిన చిత్రం రామబాణం(Ramabanam). ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్గా నటించగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. డైరెక్టర్ శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
కొన్నాళ్లుగా రామబాణం చిత్రబృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. కాగా, మిగతా చిత్రాలతో పోలిస్తే వీళ్లు వెరైటీగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. సాధారణంగా అందరిలానే ఇంటర్వ్యూలు, ఈవెంట్స్‌కి హాజరై తమ సినిమాని ప్రమోట్ చేస్తూనే మరిన్ని విధాలుగానూ ప్రేక్షకుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా గోపీచంద్, డైరెక్టర్ తేజతో చేసిన ఇంటర్వ్యూ ఎంతగా వైరల్ అయిందో చూశాం. కాగా హీరోయిన్ డింపుల్ పలువురు ఫేమస్ ఇన్‌స్టాగ్రామ్ పీపుల్స్ తో కలిసి డ్యాన్సులు, రీల్స్ చేస్తుంది. తాజాగా నిర్మాణ సంస్థ కొత్త రకం ప్రమోషన్స్ చేస్తుంది.
పొద్దున్నే అందరి ఇళ్లకు వెళ్లే పాల ప్యాకెట్స్ మీద రామబాణం స్టిక్కర్స్ అంటించి తమ సినిమాని ఇంటింటికి వెళ్లేలా చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఈ పాల ప్యాకెట్స్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే రామబాణం పేరుతో చలివేంద్రం నిర్వహిస్తూ ఓ పక్కన సినిమా ప్రమోషన్స్ చేస్తూనే మరో పక్క సమ్మర్ లో దాహం తీరుస్తున్నారు. ఈ చలివేంద్రం గుంటూరులో ఏర్పాటు చేశారు. దీంతో ప్రమోషన్స్ కొత్తగా ఉన్నా బాగానే ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.