Adipurush: ‘రామ్ సీతా రామ్’.. ఆకట్టుకుంటున్న రెండో పాట!
Hyderabad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్(Adipurush). రామాయణం ఆధారంగా బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుందీ. కాగా ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్, ఫస్ట్ సాంగ్‘జై శ్రీరామ్’(Jai Shriram) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం.
తొలి పాట ‘జై శ్రీరామ్’లో ‘మహిమాన్విత మంత్రం నీ నామం’ అంటూ రామనామం యొక్క గొప్పదనాన్ని వివరించారు. ఆయన వెంట నడుస్తూ లంకపై యుద్ధం చేసిన వానర సైన్యం పాడిన పాటగా దానిని తీర్చిదిద్దారు. రెండో పాట సీతారాముల మీద సాగుతుంది. ‘రామ్ సీతా రామ్'(Ram Sita Ram) అంటూ సాగే ఈ గీతానికి రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా… సచేత్ పరంపర సంగీతం అందించడంతో పాటు ఆలపించారు. రేడియో స్టేషన్స్, మూవీ ఛానల్స్, నేషనల్ న్యూస్ ఛానల్స్, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్, టిక్కెటింగ్ పార్ట్నర్స్, మూవీ థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్… 70కు పైగా మార్కెట్లలో విడుదల చేశారు మేకర్స్.