Ram Pothineni: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరో..!
Hyderabad: టాలీవుడ్ నుంచి మరో హీరో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (ram pothineni) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త కూతురితో రామ్ వివాహం జరగబోతోందని తెలుస్తోంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ (rapo) తన ఛార్మింగ్ లుక్స్‌తో ఫ్యాన్‌డం ఏర్పాటుచేసుకున్నాడు. 35 ఏళ్ల రామ్.. ఇప్పటివరకు సినిమాల కోసమని పెళ్లి విషయాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు చేసేసుకోవాలని అనుకుంటున్నట్లు రామ్ సన్నిహితులు చెప్తున్నారు. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే శర్వానంద్ (sharwanand) వివాహం ఘనంగా జరిగింది. త్వరలో వరుణ్ తేజ్ (varun tej) కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో (lavanya tripathi) వరుణ్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్‌లో పెళ్లికాకుండా మిగిలిపోయింది ప్రభాసే (prabhas). ఆయన కూడా ఆ గుడ్‌న్యూస్ ఎప్పుడు చెప్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.