Ram Gopal Varma: కొండా సురేఖ స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డ‌మేంటి?

ram gopal varma slams konda surekha

Ram Gopal Varma: మంత్రి కొండా సురేఖ సినీ న‌టి సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అని ప్ర‌శ్నించారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దారుణమైన ఆరోప‌ణ‌లు చేస్తూ ఆయ‌న వ‌ల్లే స‌మంత నాగ‌చైత‌న్య విడిపోయారు అంటూ సురేఖ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. దాంతో ఇండస్ట్రీ మొత్తం సురేఖ‌పై ఉమ్మేసింది. సినీ న‌టులకు సంబంధించిన‌ వ్య‌క్తిగ‌త అంశాల‌కు రాజ‌కీయ హంగుల‌ను జోడించి వ్యాఖ్య‌లు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో సురేఖ ట్విట‌ర్ ద్వారా స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

దీనిపై రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించారు. “” నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించిన‌ జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాట‌లు అన‌డాన్ని తీవ్రంగా ఖండించాలి.

సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే క‌ల‌గ‌జేసుకుని ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నాము. KTRని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు. తనని రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించడ‌మేంటి? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.

ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని , ఒక భార్యను. వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి బ‌ల‌వంతంగా పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన అవ‌మానం నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది??? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగ‌చైత‌న్య చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని ఇలాంటి వారికి గుణపాఠం నేర్పాలి “” అని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.