Ram Gopal Varma: హైప‌ర్ ఆదిపై వ‌ర్మ కామెంట్స్

Hyderabad: జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో (jabardast), క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదిలపై (hyper aadi) కామెంట్స్ చేసారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ (ram gopal varma). “” జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు… రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే “” అని ట్వీట్ చేసారు. చిరంజీవి (chiranjeevi)  న‌టించిన భోళా శంక‌ర్ (bhola shankar) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైప‌ర్ ఆది మెగాస్టార్‌ను పొగిడిన తీరు ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వారి పొగడ్త‌ల‌కు చిరు తెగ మురిసిపోతున్నారు. కానీ ఇత‌రుల‌కు మాత్రం ఇది భ‌జ‌న‌లాగా అనిపిస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ షోలో క‌నిపించే చాలా మంది క‌మెడియ‌న్స్ భోళా శంక‌ర్‌లో ఉన్నారు. చూడ‌బోతే నాగ‌బాబు రిక‌మెండేష‌న్‌తో వారికి ఛాన్సులు ఇచ్చిన‌ట్లున్నారు. ఎంత ఛాన్స్ ఇస్తే మాత్రం ప్ర‌తీసారి భ‌జ‌న చేయాల‌న్న రూల్ లేదు క‌దా..! ఈ విష‌యం వ‌ర్మ‌కి అర్థ‌మైంది కానీ చిరుకి ఇంకా అర్థంకాలేదు. ఈ భ‌జ‌న‌కు ఆయ‌న ఎంత దూరంగా ఉంటే అంత బెట‌ర్.